కోడుమూరు: కొత్తూరు గ్రామానికి చెందిన మహిళ మిస్సింగ్, కేసు నమోదు
కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళ మిస్సింగ్ పై కేసు నమోదు అయినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. కొత్తూరు గ్రామానికి చెందిన ఎం లక్ష్మి అనే మహిళ శనివారం సంతకు వచ్చి తిరిగి ఇంటికి చేరలేదు. అయితే ఆమె కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఓ పిండి గిర్ని వద్ద నుంచి ఆడబిడ్డ భర్తకు ఫోన్ చేసి ఇద్దరు వ్యక్తులు వెంటపడుతున్నారని తెలిపింది. ఆ తర్వాత ఆమె ఫోను స్విచ్ ఆఫ్ గా వచ్చింది. ఆదివారం కూడా లక్ష్మి ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.