ముదిగుబ్బలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఎంపీపీ.
ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదిగుబ్బ మండల ఎంపీపీ గొడ్డుమరి ఆదినారాయణ స్థానిక మండల బిజెపి నాయకులు పాఠశాల ఆవరణలో విద్యార్థినీ, విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.