అదిలాబాద్ అర్బన్: నేరేడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ మద్యం, పట్టిక బెల్లం, గుడుంబాను ధ్వంసం చేసిన పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ మద్యం బాటిళ్లు, గుడుంబా, పటిక బెల్లం ను పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది బుధవారం ధ్వంసం చేశారు. నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన 4 ఎక్సైజ్ కేసులోని రూ.1,13,000 విలువ గల మద్యం బాటిల్స్, రూ.23, 000 విలువ గల పటిక బెల్లం, 5 లీటర్ గుడుంబా ను ఎస్.ఐ సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.