నంద్యాల అర్బన్: నంద్యాలకు చేరుకున్న" సహకార చైతన్య యాత్ర "
Nandyal Urban, Nandyal | Apr 16, 2026
రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం నుంచి సహకార రంగాన్ని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 'సహకార చైతన్య యాత్ర' గురువారం నంద్యాలకు చేరుకుంది. రాజకీయ కక్షసాధింపులతో ఉద్యోగులను వేధించడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. రుణమాఫీ బకాయిలను వెంటనే విడుదల చేసి బ్యాంకుల ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని వారు కోరారు