రాజమండ్రి సిటీ: కొవ్వూరులో జనసేన పార్టీ నాయకుల పై టీడీపీ కార్యాలయంలో దాడి వీడియో సోషల్ మీడియాలో హల్చల్
కొవ్వూరు టిడిపి కార్యాలయంలో ఇటీవల జనసేన పార్టీ నాయకుడి పై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇద్దరు జనసేన పార్టీ నాయకులు పై సుమారు 20 మందికి పైగా టిడిపి కార్యకర్తలు దాడి చేస్తున్న వీడియో ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇప్పటికే ఇరు పార్టీల వివాదం నేపథ్యంలో జనసేన నేతలు టిడిపి కార్యాలయానికి రావడం మానేశారు. ఈ వీడియో మళ్లీ ఇరు పార్టీల మధ్య వేడి పుట్టించింది.