ఒంగోలు అర్బన్: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టరేట్ ఎదుట ధర్నా
Ongole Urban, Prakasam | Jul 14, 2026
12వ వేతన సవరణ చట్టాన్ని అమలు చేసి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీని చేపట్టి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని చేపట్టిన ఉపాధ్యాయులకు చర్చి సెంటర్లు మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేర్పిన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను రద్దు చేయాలన్నారు. కరోనా సమయంలో మరణించిన ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియమాకలుకంగా ఉద్యోగాలు కల్పించాలన్నారు