రాయచోటి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవల వల్లే వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ రక్షణ, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభించిందని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాయచోటి పరిధిలోని 55 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు వైద్యం భారం కాకుండా ప్రభుత్వం సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు.గత 16 నెలల్లో రాయచోటి ప్రాంతానికి 650 మందికి రూ.7.30 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనట్లు వెల్లడించారు.