సిర్పూర్ టి: సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలకు మరమ్మతులు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కోరిన ఎమ్మెల్యే పాల్వాయి
సిర్పూర్ టి మండలంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల భవనంకు మరమ్మతులు నిర్వహించాలని మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కోరారు. హైదరాబాదులోని మినిస్టర్స్ క్వాటర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సి గురుకుల పాఠశాలకు వెంటనే మరమ్మతులు నిర్వహించి 500 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని కోరినట్లు ఎమ్మెల్యే పాల్వైతే తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పాల్వాయి తెలిపారు,