ఒంగోలు- కరవది రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం,విచారణ చేపట్టిన పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 14, 2025
ఒంగోలు- కరవది రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన ఆదివారం సాయంత్రం ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉండగా గ్యాంగ్ మెన్ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.రైల్లో ప్రయాణిస్తూ నిద్రమత్తులో బోగీ నుండి జారిపడి ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నట్లు రైల్వే ఎస్సై మధుసూదన రావు చెప్పారు.మృతురాలి వివరాలు ఎవరికయినా తెలిస్తే చెప్పాలని కోరారు.