కోడుమూరు: కోడుమూరు కర్నూలు రహదారిపై కిందపడి గుర్తు తెలియని మహిళకు గాయాలు ఆసుపత్రికి తరలింపు
కోడుమూరు పట్టణ సమీపంలో కర్నూల్ రహదారిపై బుధవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని మహిళ కిందపడడంతో తలకు గాయాలయ్యాయి. రహదారిపై వెళ్తున్న అంబులెన్స్ సిబ్బంది వాహనం నిలిపి ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం స్థానికుల సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.