జుక్కల్: నాగమడుగులో గల్లంతైన ప్రవీణ్ మృతదేహం లభ్యం : ఎస్ఐ శివకుమార్
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం, నిజాంసాగర్ - అచ్చంపేట రహదారిలో మంజీర నదిపై గల నాగమడుగు వద్ద మంగళవారం గల్లంతైన ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్లకు చెందిన చాకలి ప్రవీణ్ మృతదేహం బుధవారం సాయంత్రం 6 గంటలకు సమయంలో లభ్యమైంది అని తెలిపారు. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.