బనగానపల్లె: మానసిక ప్రశాంతతకు యోగ ఎంతో అవసరం: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి
మానసిక ప్రశాంతతకు యోగ ఎంతో అవసరమని నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్. శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ ఉపాధ్యా యులు రంగనాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఆలయ సిబ్బందికి, పొదుపు మహిళలకు, ప్రజలకు యోగ ప్రాముఖ్యత, యోగ ఆసనాలు గురించి అవగహన కల్పించారు.