అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడుకి గాయాలు
అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. రామాపురం మండలం వడ్డేపల్లికి చెందిన రాము ఆయన కుమారుడు జగదీశ్‌తో ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వెళ్తున్న సమయంలో మరో బైక్ వచ్చి ఢీకొన్నది రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనకనుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో రాము ఘటనా స్థలంలో మృతి చెందగా కుమారుడు జగదీశ్ గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.