డోన్: బేతంచెర్ల లో మొహరం సంబరాలు, భారీగా పాల్గొన్న ప్రజలు
Dhone, Nandyal | Jun 26, 2026 బేతంచెర్ల పట్టణంలో మొహర్రం ముగింపు వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. కోటపేట, గౌరీపేట కాలనీలలో కొలువైన పీర్లను భక్తులు పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. డప్పు వాయిద్యాల నడుమ యువకులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మొహర్రం ముగింపు ఉత్సవాలు, పీర్ల ఊరేగింపును తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో భారీ కోలాహలం నెలకొంది.