కనిగిరి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి
కనిగిరి పట్టణంలోని రైతు బజార్ ఆవరణలో శనివారం కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వాతావరణ సమతుల్యం సాధించాలన్నా, సకాలంలో వర్షాలు కురవాలన్నా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, ఏం సి చైర్మన్ రమా శ్రీనివాస్, టిడిపి పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాల్గొన్నారు.