హనుమంతునిపాడు మండలంలోని పెద్ద గొల్లపల్లి గ్రామ సచివాలయాన్ని హనుమంతునిపాడు ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఎంపీడీవో పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలని, విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయం చెట్టుకు ప్రజలను ఎక్కువ రోజులు తిప్పుకోకుండా నిర్దిష్ట కాలపరిమితితో వారి సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలన్నిటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.