ఖైరతాబాద్: బిసి రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 23న చలో రాజభవన్
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 23వ తేదీన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఇప్పటివరకు ఆమోదించలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఆమోదించడం లేదన్నారు.