అసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో నిలిచిన బస్సులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో శనివారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రభావం ఆసిఫాబాద్ జిల్లాలో స్పష్టంగా కనిపించింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ బస్టాండ్ల నుంచి బస్సులు ఉదయం నుంచి నిలిచిపోయాయి. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటికి రాకపోవడంతో బస్టాండ్ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. రద్దీ ఉండే జిల్లా కేంద్రం వెలవెలబోగా, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.