నారాయణ్‌ఖేడ్: సంగారెడ్డి జిల్లా ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయండి: చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నారాయణఖేడ్‌లో కొత్తగా ప్రారంభమైన ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.