కొత్తగూడెం: మహిళ సాధికారిత, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మహిళా కాంగ్రెస్:జిల్లా మహిళా అధ్యక్షురాలు
మహిళా సాధికారిత,సామాజిక న్యాయం కోసం మహిళా కాంగ్రెస్ అహర్నిశలూ పోరాడుతున్నదని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్నలు అన్నారు.పాల్వంచ మండల పరిధి బసవతారకకాలనీ పంచాయితీ లోని సీతానగర్ కాలనీలో సోమవారం మహిళా కాంగ్రెస్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా లోని అన్నీ మండలాలకు చెందిన మహిళా కార్యకర్తలు కార్యక్రమంలో హాజరయ్యారు.దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళిలర్పించారు.గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు