చలో రాజభవన్ నేపథ్యంలో రాజ్ భవన్ వెళ్తున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విఘ్నేశ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర సర్కారుకు పంపినప్పటికీ ఏ నిర్ణయం తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. వెంటనే రిజర్వేషన్లు అమలు చేసి బిల్లును ఆమోదించాలన్నారు.