డోన్: డోన్ పట్టణంలో సందడి చేసిన జింకలు
Dhone, Nandyal | Jul 2, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలోని చెట్ల పొదలు కలిగిన ఖాళీ స్థలాల్లో జింకలు సందడి చేశాయి. మూడు జింకలు ఆ ప్రాంతంలో తిరుగుతుండగా కాలనీవాసులు వాటిని వీక్షించడం జరిగింది అనంతరం అవి మరో దిశగా పరుగున వెళ్లిపోయాయి. చాలా దూరం నుంచి జింకలు పట్టణంలోకి రావడంతో ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.