డోన్: డోన్ లో మాజీ మంత్రి బుగ్గన మార్నింగ్ వాక్
Dhone, Nandyal | May 23, 2026 నంద్యాల జిల్లా డోన్ కేవీఎస్ పార్క్ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. పార్కు చేరుకున్న ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆప్యాయంగా పలకరించి, కొంతసేపు నడకలో పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం పార్టీ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ వ్యాయామం అవసరమన్నారు