నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ఇంజనీర్
Nandyal Urban, Nandyal | May 30, 2026
నంద్యాల జిల్లాలో 40 వేలు లంచం తీసుకుంటుండగా సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ఇంజనీర్ తెలుగు రమేష్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ జారీ కోసం సివిల్ కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్. దీంతో ఏసీబీ డిఎస్పి సోమన్న సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ కొట్టుకూరు సమీపంలో నేషనల్ హైవే పై సదరు కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అనంతరం నంద్యాలకు తరలించి సదరు అధికారిపై ఇంకా విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది