ఎన్నికలు నిర్వహణకు సమయాత్తం కండి, పర్చూరు సెక్టార్ అధికారులకు అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన RDO రవీంద్రా.
ఎన్నికల నిర్వహణకు సమయాత్తం కండి నియోజకవర్గ అధికారులకు పిలుపునిచ్చిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాపట్ల ఆర్డిఓ రవీంద్ర. పర్చూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు రెవిన్యూ డివిజన్ అధికారి, బాపట్ల రవీంద్ర అధ్యక్షతన పర్చూరు నియోజకవర్గంలో పరిధిలో రాబోవు ఎన్నికలు సక్రమ నిర్వహణ కొరకు నియమించబడిన సెక్టార్ అధికారులు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అధికారులు, VROs, పంచాయతీ కార్యదర్శులు & BLOs లకు పర్చూరులోని అద్దంకి నాంచరమ్మ కల్యాణ మండపం నందు ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమలు తీరు గురించి, ఈవీఎం, VVPT ల పని విధానం గురించి అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.