బనగానపల్లె: బనగానపల్లెలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని కేడీసీఎంఎస్ ఛైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, మార్కెట్ యార్డు ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. సివిల్ సప్లై ద్వారా క్వింటాల్ జొన్నలకు రూ.3,699 మద్దతు ధర కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు