ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని మంగమూరు రోడ్డులో కారు బీభత్సం, కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగమూరు రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. మొదట ద్విచక్ర వాహనానికి కొట్టి తర్వాత పాదచారుల పైకి దూసుకు వెళ్ళింది. ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొన్న సమయంలో బుజ్జి అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సృజన అనే మహిళ మృతి చెందింది. స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.