పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ డోన్‌లో ముస్లింలు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ
Dhone, Nandyal | Apr 29, 2025 జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడులను ఖండిస్తూ మంగళవారం డోన్ ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మజీద్ నుంచి గాంధీ చౌక్ వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలి, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని నినాదాలు చేశారు. భారతదేశంపై ఏ ఒక్క దేశం యుద్ధం ప్రకటించిన ముందుగా ముస్లింలు ముందు వరుసలో ఉంటామని వారు తెలిపారు.