గుంతకల్లు: బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకోండి, గుత్తి మండలంలో పర్యటించిన అనంతపురం శాస్త్రవేత్తలు
ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన రైతులు బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకోవాలని అనంతపురం, రేకులకుంట, వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్.అరుణకుమారి, డాక్టర్.లక్ష్మణ్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని వన్నెదొడ్డి క్లస్టర్ లోని కరిడికొండ, బాచుపల్లి గ్రామాలలోని ఆముదం, కంది, వేరుశనగ పంటలను బుధవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. వేరుశనగ పంటలు ప్రస్తుతం బెట్ట పరిస్థితులు ఉన్నాయని వాటిని తట్టుకునేందుకు పొటాషియం నైట్రేట్ లీటర్ కి ఐదు గ్రాములు కలిపి పంటలపై పిచికారి చేయాలని అన్నారు. కాయ బాగా ఊరి అధిక దిగుబడులు వస్తాయని అన్నారు.