ఇటుకాలపల్లిలో జాతీయ రహదారిపై యూరియా కోసం రాస్తారోకో నిర్వహించిన రైతులు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామంలోని జాతీయ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయం 9 గంటలకు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని యూరియా వేయకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సకాలంలో యూరియా అంధక రోజుల తరబడి యూరియా కోసం సొసైటీల వద్ద రైతు వేదికల వద్ద పడికాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా దొరకడం లేదని కోపంతోనే రాస్తారోకో చేస్తున్నామని ఇప్పటికైనా తమకు యూరియా అందించాలని రైతులు ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సద్దుమణిగింప చేస్తున్నారు.