బనగానపల్లె: నంద్యాల పార్లమెంట్ పరిధిలో దివ్యాంగులకు వృద్ధులకు ఎంపీ డాక్టర్ శబరి భరోసా
పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులకు వయోవృద్ధులకు తానున్నానంటూ నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి భరోసా కల్పిస్తున్నారు వారికి అవసరమైన సహాయ పరికరాలు భారత ప్రభుత్వం తరపున ఈనెల 15వ తేదీన నంద్యాల తిక్కే మార్కెట్ యార్డులో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ శబరి కార్యాలయ సిబ్బంది శనివారం తెలిపారు. వీటి విలువ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని 3,000 మందికి పైగా లబ్ధిదారులకు అందించేందుకు ఇప్పటికే పరికరాలు నంద్యాల గోదాములకు చేరుకున్నాయని తెలిపారు