పలమనేరు: కార్తీక సోమవారాల్లో
ఆలయాల సందర్శనకు ప్రత్యేక బస్సు సర్వీసు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న డిఎం
పలమనేరు: ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ భాష తెలిపిన సమాచారం మేరకు. అక్టోబర్ 27, సెప్టెంబర్ 3, 10వ తేదీలలో ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు. మొగిలి, ములబాగల్, బంగారు తిరుపతి, కోటిలింగాలలో ఉన్న శివాలయాలను దర్శించేలా ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు రూ.425, పిల్లలకు రూ.250 టికెట్ ధర నిర్ణయించామన్నారు. కావున ఈ సదవకాశాన్ని ఆర్టిసి బస్సు ప్రయాణికులు వినియోగించుకోవాల్సిందిగా కోరారు.