బనగానపల్లె: భక్తులతో కిక్కిరిసిన రేవనూరు హుస్సేన్ వలి స్వామి దర్గా
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరులోని హుస్సేన్ వలి స్వామి దర్గా శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. వేలాది మంది భక్తులు తరలి వచ్చి ముజావర్ల ఆధ్వర్యంలో స్వామికి భక్తులు చక్కెర, చెద్దర్లతో ప్రత్యేక ఫతేహాలు సమర్పించారు. కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.