డోన్: బేతంచెర్ల మండలం లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య :ఎస్ ఐ రమేష్ బాబు
Dhone, Nandyal | Jun 2, 2026 బేతంచెర్ల మండల పరిధిలోని సిమెంట్ నగరకు చెందిన ఇంటర్ విద్యార్థిని సుప్రియ (17) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ధనుంజయ దంపతుల కుమార్తె సుప్రియ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రస్తుతం తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ బాబు తెలిపారు.