డోన్: డోన్ లో మహానాడు సమీక్ష సమావేశం
Dhone, Nandyal | May 26, 2026 నంద్యాల జిల్లా డోన్లోని టీడీపీ కార్యాలయంలో మహానాడు-2026 మహా పండుగ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గంలోని పట్టణ, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.