నారావారి నకిలీ మద్యం అరికట్టాలని వైసిపి ఇన్చార్జ్ డాక్టర్ ధార సుదీర్ ఆధ్వర్యంలో : నిరసన ర్యాలీ ఎక్సైజ్ ఆఫీసు ముందు ధర్నా
నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం వైసిపి ఇన్చార్జి దారా సుధీర్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు నారావారి నకిలీ మద్యంపై నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ఇన్చార్జి దార సుధీర్, వైసిపి కార్యకర్తలతో పటేల్ కూడలీ నుండి ఎక్సైజ్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు, డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దారా సుధీర్ మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని అరికట్టాలని అలాగే పర్మిట్ రూములను తీసివేయాలన్నారు. కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని కల్తీ మద్యాన్ని మానుకోవాలి అన్నారు.అనంతరం ఎక్సైజ్ ఎస్సై జఫ్రుల్ కు వినతి పత్రం సమర్పించారు.