ఒంగోలు అర్బన్: దొనకొండను పారిశ్రామిక హక్కుగా అభివృద్ధి చేస్తాము: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
దొనకొండలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను రెండు వారాలలోగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అద్దంకి ఆర్డిఓ విజయజ్యోతి కుమారిలతో కలిసి దొనకొండ మెగా పారిశ్రామిక హబ్ లోని వివిధ బ్లాకులను సందర్శించారు. ఈ హబ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, అవసరతలు, స్థానిక పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయా అంశాలపై తహసిల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. దొనకొండ ప్రాంతాన్ని 25వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు