గాంధారి: రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన సీతాయిపల్లి విద్యార్థి ప్రవీణ్
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన పదవ తరగతి విద్యార్థి కంది ప్రవీణ్, నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. జిల్లా తరఫున పాల్గొని విజేతగా నిలిచిన ప్రవీణ్‌ను గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.