కావలి: ప్రభుత్వ కాలేజీలను,ప్రైవేట్ కాలేజ్‌లను ప్రైవేట్వ్యక్తుల పరంచెయ్యడం దారుణం:దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లీ
జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచేప్పలని కూటమి ప్రభుత్వం అనుకోవడం దారుణం అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లీ తెలిపారు.మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెయ్యొద్దని మా డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ కాలేజీలను, ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే దళిత గిరిజన ప్రజలకు నష్టం జరుగుతుంది అని స్పష్టం చేశారు.