డోన్: ఈనెల 19 న డోన్ లో నిర్వహించనున్న మినీ మహానాడు ను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
Dhone, Nandyal | May 15, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో ఈ నెల 19న జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కోరారు. శుక్రవారం బేతంచెర్ల టీడీపీ కార్యాలయంలో పట్టణ, మండల పరిధిలోని ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు.గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.