అనంతపురం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పవర్ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. వారికి సకాలంలో పీఎఫ్ ఈఎస్ఐ చెల్లించకుండా తీరని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.