బెజ్జూరు మండలం పాపన్నపేట ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హేటిగూడ నుండి పాపన్నపేట వరకు రోడ్డు పూర్తిగా అద్వానంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సులు సైతం రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చి ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు,