కరీంనగర్: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ట్రాన్స్ఫార్మర్ పై కోతిపడి మృతి,50 ఇళ్ల లో షార్ట్ సర్క్యూట్ తో కాలిన విద్యుత్ పరికరాలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి బస్టాండ్ వద్ద గల ట్రాన్స్ఫార్మర్ పై అమాదవశాత్తు కోతి పడి మరణించడంతో 50 కి పైగా ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ అయినట్టు స్థానికులు శుక్రవారం తెలిపారు. కోతి పడడంతో విద్యుత్ తీగలు ఫేస్ టు ఫేస్ జరిగి షార్ట్ సర్క్యూట్ అవడంతో ఇండ్లలోని విద్యుత్ మీటర్లు, బల్బులు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ లు , టీవీలు ఇతర గృహ పరికరాలు కాలిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు చేరుకొని కాలిపోయిన మీటర్లు, వైర్లు రిపేరు చేశారు. 50 ఇండ్లలో విద్యుత్ షాక్ తో భారీగా ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.