బోయిన్‌పల్లి: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ఘన స్వాగతం పలికిన బోయిన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు
ఆస్ట్రేలియాలోని బ్రిస్సెన్స్ నగరంలో,తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానం మేరకు,ఇటీవల జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని,సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చిన చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం కు,రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మధ్యాహ్నం 4 గంటల 55 నిమిషాలకు ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,తెలంగాణ బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలు ఖండాంతరాలు దాటుతున్నాయని,తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ వేడుకలు ఆస్ట్రేలియాలో నిర్వహించడం ఆ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు,