చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవవర్గం .చౌడేపల్లి మండలం కాగితి గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ గృహంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాప్తి చెందడంతో ఇంట్లో ఉన్న శారదమ్మ తన కుమారుడు ఉదయ్ కుమార్ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంటి ఆవరణంలో ఉంచిన స్ప్లెండర్ వాహనంపై మంటలు వ్యాప్తి చెంది పేలడంతో భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు ఫైర్ సిబ్బంది ద్వారా తెలియాల్సి ఉంది. ఘటన శుక్రవారం రాత్రి 9 గంటలకు వెలుగులో వచ్చింది.