మాచారెడ్డి: వర్షాలతో దెబ్బతిన్న పాల్వంచ మండలంలో పంచాయతీ రాజ్ రోడ్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవునిపల్లి వరకు గల రోడ్డుకు జరుగుతున్న మరమత్తు పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరదల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను త్వరగా మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.