సిర్పూర్ టి: డబ్బా కొత్తగూడ మైసమ్మ గుడి ప్రాంగణంలో దారుణం, ఆవులు చంపి పోగులు వేసుకున్న ఘటన కలకలం రేపు తుంది
చింతల మానేపల్లి మండలం డబ్బా కొత్తగూడ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న మైసమ్మ దేవుని గుడి ప్రాంగణంలో దారుణం చోటుచేసుకుంది. హిందువుల ఆరాధ్య దైవంగా పూజించే మైసమ్మ దేవుని ప్రాంగణంలో కొందరు ఆవును చంపి కోసి పోగులు వేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మైసమ్మ దేవుని ప్రాంగణంలో ఆవును కోసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు,