నంద్యాల అర్బన్: నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో షాపులకు వేలాలు
Nandyal Urban, Nandyal | Jun 9, 2026
నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 10 దుకాణాలకు నిర్వహించిన బహిరంగ వేలం పాటలు ముగిశాయి. ఈ వేలంలో వ్యాపారులు భారీగా పోటీపడగా.. మొదటి షాపును ఇమ్రాన్ బాషా రూ.32,200కు దక్కించుకున్నారు. ఆఖరిదైన 10వ నంబరు షాపునకు అత్యధికంగా భూషణ్ రెడ్డి రూ.51,000 పాడుకోగా.. మిగిలిన షాపులను ఇతర వ్యాపారులు సొంతం చేసుకున్నారు. వేలం ప్రక్రియ అంతా పారదర్శకంగా, సజావుగా సాగిందని మార్కెట్ యార్డ్ అధికారులు వెలడించారు.