డోన్: బేతంచర్ల లో సామూహిక భగవద్గీత పారాయణం
Dhone, Nandyal | Jun 11, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణ గోపాలకృష్ణ బృందావనంలో జేష్ఠ మాస ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక భగవద్గీత పారాయణ నిర్వహించారు. ఆలయ అర్చకుడు చిరంజీవి ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి విశేష ద్రవ్యాలతో పంచామృతాభిషేకం, తులసి దళాలతో అర్చన, మహా మంగళహారతి జరిపారు. ఆయా కాలనీలకు చెందిన భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.