డోన్: బేతంచర్ల లో క్రికెట్ ఆడిన మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | May 19, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి. మంగళవారం నాటి మ్యాచ్లలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం బుగ్గన స్వయంగా క్రికెట్ ఆడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు. క్రీడల్లో గెలుపోటములు సమానమని ఆయన పేర్కొన్నారు.